Friday, December 20, 2024

కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలను రక్షిస్తున్నదెవరు..?

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi questioned the Gujarat government over drugs

బిజెపికి రాహుల్ గాంధీ ప్రశ్న

న్యూఢిల్లీ: గుజరాత్‌లో కల్తీ మద్యం కారణంగా 42మంది పేదలు ప్రాణాలు కోల్పోగా..అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల అండదండలతోనే రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వీటిపై వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాని డిమాండ్ చేసింది. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై అత్యంత పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోందని కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. ’ సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో కల్తీ మద్యం సేవించడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కూడా పట్టుబడుతూనే ఉన్నాయి.

బాపూ (మహాత్మా గాంధీ), సర్దార్ పటేల్‌లు జన్మించిన నేలపై ఇలా జరగడం అత్యంత ఆందోళనకరమైన విషయం. విచక్షణారహితంగా మత్తు వ్యాపారం చేస్తోన్న ఈ వ్యక్తులు ఎవరు..? అధికారంలో ఎవరు ఈ మాఫియాలకు రక్షణ కల్పిస్తున్నారు..? అని ప్రశ్నించారు. గుజరాత్‌లోని బోతాద్‌తోపాటు అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి వందకు పైగా బాధితులు ఆస్పత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. వారిలో ఇప్పటికే 42 మంది మృత్యువాతపడగా.. మరో 97 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. గుజరాత్ పర్యటన నేపథ్యంలో బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించాలని కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News