Sunday, December 22, 2024

Rahul Gandhi: మోడీపై వరుస ట్వీట్లతో రాహుల్ దాడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ వ్యవహారంపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? దీనిపై ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ప్రశ్నించారు. నేరారోపణలు ఎవరిపై వచ్చినా నిజాల నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా సంబంధిత దర్యాప్తు సంస్థలపై ఉంటుంది. దీనిపై ప్రధాని మోడీ ప్రజలకు ఏం సమాధానం చెపుతారని రాహుల్ నిలదీశారు. కష్టపడే జనం సంబంధిత రిటైర్మెంట్ ఫండ్ సొమ్ము కూడా అదానీ గ్రూప్‌లోనికి పెట్టుబడులుగా జారుకుంది. ఓ వైపు అదానీపై పలు రకాల తీవ్ర ఆరోపణలు, ఆర్థిక విఘాత విషయాలు వెలువడ్డా కూడా , దీనిని పట్టించుకోకుండా పింఛన్ నిధులను అదానీ సంస్థలలోకి ఎలా మళ్లిస్తారని రాహుల్ ప్రశ్నించారు.

ట్విట్టర్ ద్వారా ఈ పలు ప్రశ్నలను ఈ బహిష్కృత ఎంపి సంధించారు. జీవిత బీమాసంస్థ ఎల్‌ఐసి మూలధనం అదానీకి వెళ్లుతుంది. అదే విధంగా ఎస్‌బిఐ క్యాపిటల్ చివరికి ఇప్పుడు రిటైర్మెంట్ అనంతర పించన్ నిధి (ఇపిఎఫ్‌ఒ) కూడా అదానీ పెట్టుబడుల ఖాతాలోకి భద్రంగా చేరుకుంది. దేశమంతటా మోదానీ (మోడీ, అదానీ) లింకుల గురించి తెలిసిపోతున్న దశలో ప్రజలకు చెందిన పింఛన్ డబ్బులు ఇదే అదునుగా అదానీ పెట్టుబడులలోకి ఎలా చేరుతాయని రాహుల్ ప్రశ్నించారు. ప్రధాని గారూ …ఏ దర్యాప్తు లేదు. జవాబు ఇవ్వరు. ఇంతగా ఎందుకు భయపడుతున్నారు? అని రాహుల్ హిందీలోట్వీటు వెలువరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఆరంభం నుంచి కూడా అదానీ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్రస్థాయిలో వాడికి వేడికి దారితీసింది.

బడ్జెట్ సెషన్ దాదాపుగా ఎటువంటి ఇతరత్రా అంశాల ప్రస్తావనలు లేకుండా ముగిసే పరిస్థితి ఏర్పడుతోంది. తాము పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్నది కేవలం అదానీ కంపెనీల్లోకి భారీ ఎత్తున నిధులు ఎలా చేరాయనేదే అని, దీనిని కప్పిపుచ్చేందుకు మోడీ ఎందుకు యత్నిస్తున్నారని తరచూ పలు వేదికలపై నుంచి రాహుల్ ప్రశ్నిస్తున్నారు. అదానీని ప్రధాని ఈ విధంగా చివరకు పార్లమెంట్ స్థాయిలో కూడా రక్షిస్తున్నట్లు స్పష్టం అవుతున్నందున ,అదానీపై చర్చ జరిగినా, జెపిసి దర్యాప్తు చేపట్టినా నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రధాని భయపడుతున్నారని రాహుల్ స్పష్టం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు ఓ కేసు విషయంలో జైలు శిక్ష పడటం, ఎంపిగా అనర్హత వేటుకు గురి కావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా రాహుల్ ప్రధాని మోడీపై మరింత తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ప్రజల పించన్ నిధి పరుల పాలు అవుతుంటే ప్రధాని పదవి విప్పరా? అని ఘాటుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News