- Advertisement -
చైనా వంతెన నిర్మాణంపై రాహుల్ ప్రశ్న
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ సమీపాన లడఖ్‌లో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్లు వెలువడుతున్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు? మన భూమి, మన ప్రజలు, మన సరిహద్దుల పట్ల ఇంత అలక్షమా అంటూ రాహుల్ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఎల్‌ఎసికి అత్యంత సమీపంంలో పాంగాంగ్ సరస్సుపై గత రెండు నెలలుగా చైనా వంతెన నిర్మిస్తున్నట్లు వచ్చిన వార్తా కథనాలను రాహుల్ తన ట్వీట్‌తో జతచేశారు. ఇదిలా ఉండగా&జమ్మూ కశ్మీరులోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు మరణించారు. ఓకే గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టినట్లు ఐజి విజయ్ కుమార్ తెలిపారు.
- Advertisement -