- Advertisement -
న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కాకకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించ బోతుండడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మోడీపై విరుచుకు పడ్డారు.‘ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభింప జేయకుండా, కనీసం ఆమెను ఆహ్వానించకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దేశ సర్వోన్నత రాజ్యాంగ పదవిని అవమానించడమే. పార్లమెంటు భవనం దురహంకారపు ఇటుకలతో నిర్మించినది కాదు, రాజ్యాంగ విలువలతో నిర్మించిన దేవాలయం’ అని హిందీలో చేసిన ట్వీట్‌లో రాహుల్ దుయ్యబట్టారు.
- Advertisement -