Monday, November 25, 2024

ఏది జరిగినా నా కర్తవ్యం ఒకేలా ఉంటుంది: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరువునష్ట కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై రాహెల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఎన్ని అడ్డంకులు ఎదురయినా, ఎలాంటి పరిణామాలు ఎదురయినా తనను ఎవరూ అపలేరన్నారు. ‘ఏది జరిగినా నాకర్తవ్యం మాత్రం ఒకేలా ఉంటుంది.దేశ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు కాపాడడమే నా బాధ్యత’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. సుప్రీకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటలకు రాహుల్ గాంధీ ఎఐసిసి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు లేదా రేపు, ఎల్లుండి సత్యం ఎప్పటినీ నిలస్తుందన్నారు. నా బాట సుస్పష్టం.

మాకు సాయపడిన వారి పట్ల, మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతు అందిస్తున్న ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటా’ అని అన్నారు. ఇదే మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ విజయం కేవలంరాహుల్ గాంధీదే కాదని, ఈ దేశ ప్రజలు, ప్రజాస్వామ్యానికి విజయమని అన్నారు. ‘ ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు.ప్రజాస్వామ్యం గెలిచింది, న్యాయవ్యవస్థ గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నా. రాజ్యాంగం ఇంకా జీవించి ఉంది’ అని ఖర్గే అన్నారు. లోక్‌సభనుంచి రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడానికి కేవలం 24 గంటలు తీసుకున్నారని, ఇప్పుడు ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి ఎంత సమయం తీసుకుంటారో చూడాలని ఖర్గే అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News