Sunday, December 22, 2024

ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిందని ఆయన అన్నారు. దీంతో రాష్ట్రంలోని 6.4 లక్షల మంది రైతు కుటుంబాలకు ఉపశమనం కలిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సోదర, సోదరీమణులకు మరోసారి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. దేశంలో బిజెపి ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన విమర్శించారు.

పంటలకు కనీస మద్దతు ధరకు కల్పించేందుకు బిజెపి నిరాకరించిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా రాహుల్ ట్వీట్ పెట్టారు. కాగా, తొలి విడతలో రూ.6098 కోట్లు, రెండో విడతలో రూ.6190 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 17 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 12 వేల 224 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News