Friday, December 27, 2024

గాంధేయవాదమే మిన్న

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Reacts As violent protests

రాహుల్ గాంధీ ట్వీట్

న్యూఢిల్లీ : దేశానికి ఇప్పుడు కావల్సింది హింసావాదం కాదు, పూజ్య బాపూజీ ప్రవచించిన ఆదర్శాలే స్వాతంత్ర భారతానికి పునాదులు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపి ప్రతినిధి నుపూర్ శర్మ వ్యాఖ్యలు తరువాత తలెత్తిన నిరసనలు, హింసాత్మక ఘటనలపై రాహుల్ శనివారం స్పందించారు. భారతదేశం ఎల్లవేళలాగాంధీజి చెప్పిన సత్యం, అహింసా, సహోదరత్వానికి ఉదాహరణగా నిలిచింది. విద్వేషాలు అశాంతికి మన పథానికి చెందినవి కావు. దేశ ప్రజలంతా సమైక్యంగా ఉండి, పరస్పర సుభిక్షాన్ని ఆశించాలని ఈ దిశలోనే సంక్లిష్టతలను పరిష్కరించుకోవల్సి ఉంటుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News