Thursday, January 23, 2025

ఆటోలో రాహుల్ గాంధీ హల్ చల్ (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

జోరుగా.. హుషారుగా తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మంగళవారం అకస్మాత్తుగా ఆటో ఎక్కి హల్ చల్ చేశారు. సాధారణ ప్రజానీకంతో కలసిపోయి, వారి సాధకబాధకాలు తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపుతారు. ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులు, ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం ముగిశాక, ఓ ఆటోలో కూర్చుని, కాసేపు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రయాణించారు. అలా వెళ్తూనే ఆటో డ్రైవర్ ను కుశలప్రశ్నలు వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News