Monday, December 23, 2024

స్కూటర్‌పై రాహుల్ బెంగళూరులో హంగామా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సరుకులు పంపిణీ చేసే డెలివరీ ఏజెంట్ స్కూటర్ వెనుక కూర్చుని ప్రయాణించాడు. అక్కడున్న భద్రతా సిబ్బంది, చివరికి తోటి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విస్తుపోయి చూస్తూ ఉండగానే ఆయన స్కూటర్ వాలాతో కలిసి ప్రయాణించారు. బెంగళూరులో పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన రాహుల్ ఆ తరువాత సమీపంలో తాను బస చేస్తున్న హోటల్‌కు స్కూటర్‌పై వెళ్లారు.

ఓ కార్యకర్త నుంచి హెల్మెట్ తీసుకుని ధరించి ఆయన ముందుకు సాగారు. అంతకు ముందు అక్కడ గుంపులో చిక్కుపడి ఏడుస్తూ ఉన్న ఓ బాలుడిని దగ్గరకు తీసుకుని సముదాయించాడు. దారి పొడవునా ఉన్న జనం రాహుల్‌ను చూసి కేరింతలు కొట్టారు. కొందరు యువకులు తమ బైక్‌లపై రాహుల్ స్కూటర్ వెంబడి కొద్ది దూరం వెళ్లారు. ఆయన స్కూటర్ ప్రయాణం వారిని హుషారెత్తించింది. బెంగళూరులో ప్రధాని మోడీ భారీ రోడ్ షో దశలోనే రాహుల్ ఈ స్కూటర్ జర్నీ విశేష పరిణామం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News