Monday, December 23, 2024

హిజబ్ పేరిట బాలికల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -
Rahul Gandhi said on Hijab controversy in Karnataka
రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: కర్నాటకలోని విద్యా సంస్థలలో హిజబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజబ్ పేరిట బాలికల విద్యను అడ్డుకుంటూ వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. వసంత పంచమిని శనివారం దేశంలో చదువుల తల్లి సరస్వతీ దేవి జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ సరస్వతీ దేవి ఎవరినీ వేరుగా చూడదని, అందరికీ సమంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. హిజబ్ పేరిట బాలికల విద్యకు అవరోధం కల్పించడం ద్వారా భరతమాత పుత్రికల భవిష్యత్తును దెబ్బతీస్తున్నామంటూ రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News