Sunday, December 22, 2024

రాజ్యాంగాన్ని నాశనం చేయడమే బిజెపి లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఆదివాసీల నుంచి ‘నీరు, అడవి, భూమి’ లాక్కోవాలని బిజెపి చూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. ఝార్ఖండ్ ఎన్నికలను ఇండియా కూటమి, బిజెపిఆర్‌ఎస్‌ఎస్ ఫ్రంట్ మధ్య సైద్ధాంతిక పోరుగా ఆయన అభివర్ణించారు. ఝార్ఖండ్‌లోని సిమ్‌దెగాలో ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి లక్షం దేశ రాజ్యాంగాన్ని ‘నాశనం’ చేయడమేనని ఇండియా కూటమి దాని ‘కాపాడాలని వాంఛిస్తోంది’ అని చెప్పారు. ‘భూమి, అడవి, నీరు కాషాయ పక్షానికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు, పెట్టుబడిదారులకు చెందినవి కనుక ప్రధాని (నరేంద్ర) మోడీ మిమ్మల్ని ‘వనవాసీ’గా పిలుస్తుంటాను. బిజెపి తాను కొత్తగా పేర్కొన్న పదం అభివృద్ధి కింద ఆదివాసీ భూమిని కైవసం చేసుకోవడాన్ని విశ్వసిస్తోంది. అది ఆదివాసీల నుంచి నీరు, అడవి, భూమిని లాక్కోవాలని వాంఛిస్తోంది’ అని రాహుల్ ఆరోపించారు. రాజ్యాంగంపై ‘నిరంతరం దాడి’ జరుగుతోందని, ఇండియా కూటమి ‘దానిని కాపాడేందుకు అన్ని విధాల కృషి చేస్తోంది’ అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే కుల గణన జరిగేలా చూస్తుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘రాజ్యాంగం నిరంతర దాడికి గురి అవుతోంది. దానిని పరిరక్షించవలసిన అవసరం ఉంది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోను తొలగిస్తాం. మేం ఝార్ఖండ్‌లో అధికారంలోకి వచ్చినట్లయితే ఎస్‌టిలకు ప్రస్తుత 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్‌సిలకు ప్రస్తుత 10 శాతం నుంచి 12 శాతానికి, ఒబిసిలకు ప్రస్తుత 14 శాతం నుంచి 27 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం’ అని రాహుల్ తెలియజేశారు. దేశంలోని వివిధ సంస్థలు. సంపదలో ‘ఆదివాసీలు, దళితులు, ఒబిసిల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకు కుల గణన తప్పనిసరి’ అని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘నేను పార్లమెంట్‌లో ఈ అంశం ప్రస్తావించినప్పుడు ప్రధాని మోడీ మౌనం వహించారు, ఆ తరువాత రాహుల్ గాంధీ దేశాన్ని చీల్చాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు’ అని కాంగ్రెస్ నేత చెప్పారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమం ప్రకటన దరిమిలా రాష్ట్రానికి రాహుల్ రావడం ఇది రెండవ సారి. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా ఈ నెల 13. 20 తేదీల్లో నిర్వహిస్తారు. వోట్ల లెక్కింపు 23న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News