Wednesday, January 22, 2025

మోడీ జన్మతః ఓబిసి కాదు

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

జుర్సుగూడ(ఒడిశా): ప్రధాని నరేంద్ర మోడీ ఇతర వెనుకబడిన కులానికి(ఓబిసి) కుటుంబంలో జన్మించలేదని, తతను తాను ఓబిసిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలో మూడు రోజుల తన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అగ్ర కులలానికి చెందిన కుటుంబంలో నరేంద్ర మోడీ జన్మించారని తెలిపారు.

తేలి కులానికి చెందిన కుటుంబంలో మోడీ జన్మించారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వ హయాంలో ఈ కులాన్ని ఓబిసి జాబితాలో చేర్చారని రాహుల్ వివరించారు. అందువల్ల మోడీ జన్మతః ఓబిసి కారని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఓబిసిలకు కరచాలనం చేయరని, కాని కోటీశ్వరులను మాత్రం ఆలింగనం చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు.

తెలుపు రంగు టీ షర్ట్ ధరించిన రాహుల్ గాంధీ ఇక్కడి పాత బస్టాండు నుంచి ఓపెన్ జీపులో న్యాయ యాత్రను పునః ప్రారంభించారు. ఆయన వెంట ఎఐసిసి నాయకుడు అజయ్ కుమార్, ఓపిసిసి అధ్యక్షుడు శరత్ పట్నాయక్ ఉన్నారు. రాహుల్ న్యాయ యాత్ర మధ్మాహ్నం ఓడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News