Wednesday, January 22, 2025

కొవిడ్ బాధితులకు నష్టపరిహారం అందాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

గుండ్లుపేట్(కర్నాటక): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్ బాధిత కుటుంబ సభ్యులతో గడిపి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. ‘‘మీరెందుకు వారికి దక్కాల్సిన కొవిడ్ ఆర్థిక సాయాన్ని ఇవ్వడం లేదు?’’ అని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రశ్నించారు. అంతేకాక ఆయన మోడీని సంబోధిస్తూ ట్వీట్ కూడా చేశారు.

ఓ చిన్న అమ్మాయి ప్రతీక్ష రాహుల్ గాంధీ దగ్గరికొచ్చి మాట్లాడుతూ కొవిడ్ కారణంగా తన తండ్రి చనిపోయాడని, తన తల్లి ఉద్యోగం లేకుండా కష్టాలు పడుతోందని, తాను చదువాలనుకుంటున్నానని, డాక్టరు కావాలనుకుంటున్నానని తనకు సాయం కావాలని చెప్పింది. ఆ చిన్న అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న వారు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో 21 రోజుల్లో, కర్నాటకలోని వివిధ జిల్లాల్లో 511 కిమీ. యాత్రను రాహుల్ గాంధీ, ఆయన అనుయాయులు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News