Monday, December 23, 2024

రాహుల్ గాంధీకి చలేసింది…జాకెట్ తొడిగారు!

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్తూ వస్తున్నారు. చలి తీవ్రంగా ఉన్న కాలంలో ఆయన ఇప్పుడు ఉత్తర భారత దేశంలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదివరలో ఆయన తనకు చలివేసే వరకు స్వెటర్ వేసుకోనని, అంత వరకు టిషర్టుతోనే యాత్ర చేస్తానని అన్నారు. ఆయన గురువారం పంజాబ్ నుంచి జమ్ములోకి ప్రవేశించారు. జమ్ములోని అనేక ప్రాంతాలతో మంచు తుంపరలు కురుస్తున్నాయి. దాంతో ఆయనకు చలి అనుభూతి మొదలయింది. దాంతో దెబ్బకు జాకెట్ వేసేసుకున్నారు. తర్వాత ఆయన ఆ జాకెట్‌ను తీసేసి మళ్లీ టిషర్టుతోనే నడిచారు. ఆయన ఇప్పటి వరకు 125 రోజుల్లో 3400 కిమీ. పయనించారు. ఆయన పాదయాత్రను చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆయన యాత్రలో ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. చివరికి ప్రతిపక్షం వారు కూడా ఆయనను లోలోన మెచ్చుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో పేదపిల్లలు చింపిరి దుస్తులు ధరించి చలికి బాధపడుతున్నారని, తాను కూడా తనకు చలి అనిపించే వరకు సాదాసీదాగా టిషర్టుతోనే ఉంటానన్నారు. కానీ ఆయన ఇప్పుడు జమ్ములోకి అడుగుపెట్టాక ఆయనకు చలి వణికించింది. దాంతో జాకెట్ వేసుకున్నారు.

రాహుల్ గాంధీ జనవరి 25న జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఆ తర్వాత ఆయన అనంత్‌నాగ్ గుండా ఆయన జనవరి 27న శ్రీనగర్‌లో ప్రవేశిస్తారు. ఆయనకు గట్టి భద్రతను కల్పించారు. రాహుల్ గాంధీ జమ్ములోకి ప్రవేశించగానే ఆయనకు ఘన స్వాగతం లభించింది. కశ్మీరీ ప్రముఖ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆయనను రిసీవ్ చేసుకోడానికి లఖన్‌పూర్ వైపుకి పయనమయ్యారు. భారత్ జోడో యాత్ర ఇప్పుడు చివరి అంకంలో ఉంది. రాహుల్ గాంధీని కఠువా జిల్లాలో పెద్ద సంఖ్యలో జనులు రిసీవ్ చేసుకున్నారు. పాటలు, నృత్యాలతో అలరించారు. ఆయన యాత్ర రాత్రి ఛద్వాల్‌లో ఆగనుంది. రేపు ఉదయం హీరానగర్ నుంచి దుగ్గర్ హవేలీకి తిరిగి సాగనుంది. ఆ తర్వాత జనవరి 22న విజయ్‌పూర్ నుంచి సత్వారికి సాగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News