Saturday, December 21, 2024

రాహుల్‌కు దమ్ముంటే బిసి సిఎం ప్రకటన చేయాలి: రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిసి సిఎం ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. బిసిల పట్ల రాహుల్ గాంధీకి చిత్త శుద్ధి ఉంటే, ఈఎన్నికల్లో బిసిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబిసి నేతను బిజెపి ప్రధాని చేసిందని గుర్తు చేశారు. మైనార్టీ, దళిత, గిరిజన నేతలను రాష్ట్రపతిలను చేసిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి ఈఎన్నికల్లో అధికారం కట్టబెడితే డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెడుతుందన్నారు.

రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: బండి సంజయ్
తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బిజెపి బిసిని ఎలా సిఎం చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఓబిసి కుల గణన చేపడతామని రాహుల్ గాంధీ అంనడం నవ్వొచ్చేదిగా ఉందన్నారు.  దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన పార్టీ కాంగ్రెస్ అయినా,  ఏనాడు ఓబిసి కులగణన చేయలేదన్నారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో కాంగ్రెస్ ఓబిసిల జపం చేస్తోందన్నారు. బిసిలకు రాహుల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని.. తర్వాతే ఓట్లు అడగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News