Friday, November 8, 2024

మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసుకోండి: అస్సాం పోలీసులకు రాహుల్ సవాల్

- Advertisement -
- Advertisement -

బార్‌పేట (అస్సాం): జన సమూహాన్ని రెచ్చగొట్టారనే ఆరోపణపై తనపైన, ఇతర కాంగ్రెస్ నాయకులపైన గువాహటి పోలీసులు కేసు దాఖలు చేసిన మరునాడు బుధవారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ‘వీలైనన్ని కేసులు’ దాఖలు చేసుకోవలసిందిగా బిజెపికి సవాల్ విసిరారు. తనను బెదరించలేరని రాహుల్ స్పష్టం చేశారు. బార్‌పేట జిల్లాలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఏడవ రోజు తన తొలి బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘భూమి, వక్కలకు సంబంధించిన పెక్కు ఆరోపణలతో దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి’ ఆయన అని రాహుల్ విమర్శించారు. ‘కేసులు దాఖలు చేయడం ద్వారా నన్ను బెదరించవచ్చునన్న అభిప్రాయం హిమంత బిశ్వ శర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు వీలైనని కేసులు దాఖలు చేయండి. మరి 25 కేసులు దాఖలు చేయండి. నన్ను బెదరించలేరు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నన్ను బెదరించలేవు’ అని రాహుల్ అన్నారు. అస్సాం రాజధానిలో హింసాత్మక చర్యలకు ఉద్దేశపూర్వకంగా పాల్పడినందుకు రాహుల్ గాంధీపైన, ఇతర నేతలపైన గువాహటి పోలీసులు ఐచ్ఛికంగా మంగళవారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

‘(నరేంద్ర) మోడీ ప్రత్యేక మిత్రుడు(గౌతమ్) అదానీకి వ్యతిరేకంగా నేను ఉపన్యాసం ఇచ్చాను. నాపై కేసు దాఖలు అయింది. అప్పుడు వారు నన్ను పార్లమెంట్‌లో నుంచి గెంటివేశారు. నాప్రభుత్వనివాసాన్ని లాగుకున్నారు. నేను స్వయంగా తాళం చెవులు ఇచ్చాను. నాకు అది అక్కరలేదు’ అని రాహుల్ చెప్పారు. “మా ఇల్లు ప్రతి భారతీయ పౌరుని హృదయంలో ఉంది. నాకు అస్సాం, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, తక్కిన రాష్ట్రాలలో లక్షలాది ఇళ్లు ఉన్నాయి’ అని రాహుల్ చెప్పినప్పుడు ప్రజలు పెద్ద పెట్టును హర్షధ్వానాలు చేశారు. బిష్ణుపూర్‌లో మ ంగళవారం రాత్రి బస చేసిన అనంతరం రాహుల్ అస్సాంలో ఏడవ రోజు యాత్రను బార్‌పేట్ పట్టణం నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు రోడ్ షోతో ప్రారంభించారు. అక్కడ ఆయన ఒక కారు పైన కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News