Thursday, January 23, 2025

నా ప్రతిష్టను దెబ్బతీయడానికి బిజెపి కోట్లు గుమ్మరించింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

జమ్ము: తన ప్రతిష్టను దెబ్బతీయడానికి బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్ ఒక క్రమపద్ధతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు గుమ్మరించాయని, కానీ ఈ కోట్ల డబ్బు సత్యాన్ని మరుగుపర్చలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్ములో పాత్రికేయుల సమావేశంలో స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించే ముందు మంగళవారం ఆయన మాట్లాడారు.

సామాజిక మాధ్యమాల్లో తనను “పప్పు” అని ఎగతాళి చేస్తూ ప్రచారం సాగించడంపై అడగ్గా ఆయన పై విధంగా సమాధాన మిచ్చారు. దేశంలో సత్యం ఒక్కటే పనిచేస్తుందని, డబ్బు, అధికారం, నిర్లక్షం పనిచేయబోవని బీజేపీకి కాంగ్రెస్ గుణపాఠం చెబుతుందన్నారు. డబ్బు, అధికారం ఉంటే ఏదైనా చెల్లుతుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News