Sunday, December 22, 2024

బిజెపి పనులకు, హిందూ మతానికి సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

లండన్: పాలక పార్టీ బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని, అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని సైన్సెస్ పిఒ యూనివర్శిటీలో విద్యార్థులు, విద్యావేత్తలతో శనివారం జరిగిన గోష్ఠిలో ఆయన మాట్లాడారు. భారత్ జోడో యాత్ర, భారత ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు పోరాటానికి విపక్షాల కూటమి, ప్రపంచ క్రమంలో వస్తున్న మార్పులు తదితర కీలక అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. “నేను భగవద్గీత, ఉపనిషత్తులు, చదివాను. అనేక హిందూ పుస్తకాలు చదివాను. బీజేపీ చేసే దానిలో హిందూయిజం ఏమీ లేదు. నీకన్నా బలహీనులైన వారిని భయపెట్టాలని,హాని చేయాలని, ఏ హిందూ పురాణాల్లోనూ లేదు. ఏ హిందూ పండితుని నుంచి కూడా ఆ మాట నేను వినలేదు. హిందూయిజం గురించి వాళ్లు ( బీజేపీ ) చేసిందేమీ లేదు.

ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. అధికారం కోసం వాళ్లేమైనా చేస్తారు” అని రాహుల్ పేర్కొన్నారు. “మీరెంతైనా చేయవచ్చు. కానీ దేశానికి మాత్రం హాని చేయకూడదు. ఇది భారతీయ ఆత్మపై దాడి. ఈ పనిచేస్తున్నవారు దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు” అని ఆయన వ్యాఖ్యానించారు. తన అనుభవాలను గుర్తు చేస్తూ “నాపై 24 కేసులు ఉన్నాయి. క్రిమినల్ పరువు నష్టం కేసులో భారత్‌లో తొలిసారిగా గరిష్ఠ శిక్ష నాకే పడింది” అని పేర్కొన్నా రు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలను బతికించేందుకు నిత్యం పోరాడుతున్నాం అని ఆయన అన్నారు.

ప్రతిపక్ష కూటమికి ‘ ఇండియా’ అనే పేరు ఉన్నందునే మోడీ ప్రభుత్వం దేశానికి “భారత్ ” అని పేరు మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “రాజ్యాంగం ప్రకారం దేశానికి రెండు పేర్లు ఉన్నాయి. ఇందులో ఎలాంటి సమస్యా నాకు కనిపించలేదు. రెండు పేర్లూ ఆమోద యోగ్యమే. కానీ మా కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం వల్ల ప్రభుత్వ పెద్దలకు చికాకు కలిగిందని అనుకుంటున్నాను. దేశం పేరును మార్చాలనుకునే వారు ప్రాథమికంగా దేశ చరిత్రను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశ చరిత్ర భావితరాలకు తెలియజేయాలని వారు కోరుకోవడం లేదు” అని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News