Sunday, December 22, 2024

రాజ్యాంగం రద్దు యత్నాలను అడ్డుకుంటాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

భగల్‌పూర్: రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు అధికార బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ ప్రయత్నాలను ప్రతిపక్ష ఇండియా కూటమి అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లోని భగల్‌పూర్‌లో తన మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలను గెలుచుకుంటామన్న బిజెపి ప్రకటనలను ఆయన తోసిపుచ్చారు.

బిజెపికి 150కి మించి సీట్లు దక్కవని ఆయన జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బిజెపిఆర్-ఎస్‌ఎస్ కూటమి ప్రయత్నిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి పోరాడుతోందని ఆయన చెప్పారు. దేశంలోని పేదలు, దళితులు, గిరిజనులకు ఏవైనా ప్రయోజనాలు దక్కాయంటే అవి రాజ్యాంగం వల్లనేనని, రాజ్యాంగం రద్దయిన పక్షంలో అన్ని ప్రయోజనాలు అంతం అయిపోతాయని రాహుల్ చెప్పారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సంపన్నులకు అనుకూలమైన ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. దాదాపు దేశంలోని 70 శాతం జనాభా వద్ద ఉన్న సంపద కేవలం 22 మంది వ్యక్తుల చేతుల్లో ఉందని, ఈ పరిస్థితిని తాము మారుస్తామని ఆయన చెప్పారు. అగ్నివీర్ పథకం రద్దు, అప్రెంటిస్ షిప్ హక్కు కల్పించడం వంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను గురించి ఆయన ప్రజలకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News