Friday, December 20, 2024

బిజెపి కోరుకున్నా, కోరుకోకపోయినా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లో తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. ఇండియా కూటమి సాయంతో తమ పార్టీ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ జరిగేలా చూస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. ‘అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందే జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఆశించాం. కానీ బిజెపి సుముఖంగా లేదు. ఎన్నికలు ముందు నిర్వహించాలని బిజెపి కోరింది’ అని ఆయన చెప్పారు. ‘బిజెపి కోరుకున్నా, కోరుకోకపోయినా ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా తిరిగి వచ్చేలా చూస్తాం.

రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరిగేలా ఇండియా కూటమి పతాకం కింద ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ స్పష్టం చేశారు. రామ్‌బన్ జిల్లా బనీహాలల అసెంబ్లీ నియోజకవర్గంలోని సంగల్దాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ఈ నెల 18న తొలి విదతగా మరి 25 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు బనీహాల్‌లో పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ తరఫున వికార్ రసూల్ వనీ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News