- Advertisement -
న్యూఢిల్లీ: నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 13మంది పౌరులు మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ మేరకుఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘ఇది హృదయ విదారకం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాచారం ఇవ్వాలి. స్వదేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా ఒక ట్వీట్‌లో ఈ సంఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి న్యాయం జరగాలన్నారు.
Rahul Gandhi slams Centre over Nagaland Incident
- Advertisement -