Friday, November 15, 2024

రాజ్యాంగంపై దాడిని అనుమతించేది లేదు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, దీనిని ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. ఈవిధమైన దాడి తమకెవరికీ అంగీకారం కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల సందేశం ప్రజలకు చేరుతోందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమ సందేశం ప్రజలకు చేరుతోందన్నారు. ఏ శక్తీ రాజ్యాంగాన్ని తాకలేదని, దాన్ని తాము రక్షిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా 18వ లోక్‌సభ మొదటి సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. తరువాత ఎక్స్ పోస్ట్‌లో రాహుల్ నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తూ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో మోడీ నిమగ్నమయ్యారన్నారు. బలమైన విపక్షం ఇండియా కూటమి ప్రజల గొంతు బలంగా వినిపిస్తుందని, ప్రధాని మోడీ జవాబుదారీ కాకుండా తప్పించుకోకుండా చూస్తామన్నారు.

“ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మొదటి 15 రోజుల్లోనే ఘోరమైన రైలు ప్రమాదం, కశ్మీర్‌లో ఉగ్రదాడి, రైళ్లలో ప్రయాణికుల బాధలు, నీట్‌స్కామ్, నీట్‌పీజీ రద్దు, యుజిసి నెట్ పేపర్ లీక్, పాలు, కాయధాన్యాలు, గ్యాస్, టోల్ ధరలు పెరుగుదల, అడవులు అగ్నికి ఆహుతి కావడం, నీటి సంక్షోభం, హీట్‌వేవ్‌లో సదుపాయాలు కరువై మరణాలు సంభవించడం ఇవన్నీ జరిగాయి” అని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News