Tuesday, November 26, 2024

ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల అభివృద్ధికి మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆటంకం: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ దళితులు, ఆదివాసీలు, ఒబిసిల పథంలో అడ్డుగోడను పటిష్ఠం చేస్తున్నట్లు లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. ఆ గోడను బలహీనపరిచేందుకు యుపిఎ చర్యలు తీసుకున్నదని, కానీ చేయవలసినంతగా యుపిఎ చేయలేకపోయిందని ఆయన అంగీకరించారు. ఢిల్లీలో ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’లో ప్రసంగించిన రాహుల్ పార్లమెంట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించారు.

రాజ్యాంగాన్ని ‘మోడీ చదవలేదని’ తాను ఘంటాపథంగా చెప్పగలనని ఆయన అన్నారు. ‘ప్రధాని మోడీ ఈ గ్రంథాన్ని చదివి ఉన్నట్లయితే, ఆయన రోజువారీగా చేస్తున్నది చేయబోరు’ అని రాహుల్ భారత రాజ్యాంగం ప్రతిని ప్రదర్శిస్తూ చెప్పారు. దేశం మొత్తం వ్యవస్థ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు వ్యతిరేకంగా నిలిచిందని ఆయన ఆరోపించారు.

ఒక గోడ దళితులు, ఆదివాసీలు, ఒబిసిల మార్గాన్ని అవరోధంగా ఉన్నదని, మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ‘సిమెంట్ చేర్చి’ గోడకు బలం చేకూరుస్తున్నట్లు ఆయన విమర్శించారు. ‘క్రమంగా (ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిల మార్గానికి అవరోధంగా ఉన్న) గోడ బలం పుంజుకుంటున్నది. ఇంతకుముందు యుపిఎ ప్రభుత్వం ఎంజిఎన్‌రెగా, భూ సేకరణ చట్టం, ఆహార హక్కు తీసుకువచ్చింది& అవి ఆ గోడను దుర్బలం చేయడానికి ఉద్దేశించినవి. ఇప్పుడు నేను పునరాలోకనం చేస్తే, యుపిఎ ప్రభుత్వం చేయవలసినంతగా ఆ గోడను దుర్బలం చేయలేదని, అది తగినంత తీవ్ర స్థాయిలో చేయలేదని చెప్పగలను’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో నిర్వహించిన కుల గణన చరిత్రాత్మక చర్య అని, కాంగ్రెస్ తాను అధికారంలోకి వచ్చిన ప్రతి చోట ఆ పని చేస్తుందని రాహుల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News