Thursday, January 23, 2025

మోడీజీ.. దేవుడికే పాఠాలు చెప్పగలరు

- Advertisement -
- Advertisement -

శాంటాక్లారా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటాక్లారాలో మంగళవారం ప్రవాస భారతీయులు ‘మొహబ్బత్ కీ దుకాన్’ పేరిట ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని, అధికార బిజెపిని లక్షంగా చేసుకొని మాటల దాడి చేశారు. భారత్‌లో దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే వ్యక్తులు ఉన్నారని, ప్రధాని మోడీ కూడా ఆ కోవకిందికే వస్తారని వ్యాఖ్యానించారు.

‘ఆ వ్యక్తుల సమూహం ప్రతిదీ తమకే తెలుసునని భావిస్తారు. వారు చరిత్రకారులకు చరిత్ర, శాస్త్రవేత్తలకు సైన్స్,సైన్యానికి యుద్ధం వంటివి సమస్తం వివరించేయగల సమర్థులుగా భావిస్తుంటారు. అవసరమైతే దేవుడికి కూడా విశ్వంలో ఏం జరుగుతోందో వివరించేయగలరన్నారు. అయితే ప్రపంచం చాలా పెద్దది. ఏ వ్యక్తికీ అన్నీ తెలియవు. కానీ ఆయా వక్తులు మాత్రం తమకే అన్నీ తెలుసునన్న భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News