Friday, December 20, 2024

అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మోడీ కొత్త వ్యూహాలు : రాహుల్

- Advertisement -
- Advertisement -

వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మోడీ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని, విషపూరిత భాషతో ద్వేష ప్రసంగాలు చేస్తున్నారని, అయితే ఈ అబద్ధాల వ్యాపారానికి ముగింపు దగ్గరకొచ్చిందని కాంగ్రెస్ సోమవారం తీవ్రంగా మండిపడింది. ప్రజల సంపద అంతా చొరబాటు దారులకు కాంగ్రెస్ తిరిగి పంపిణీ చేస్తుందని ప్రధాని మోడీ రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి కూడా కాంగ్రెస్ భగ్గుమంది. ధరలు పెరుగుదల, నిరుద్యోగం ప్రముఖంగా ప్రస్తావిస్తూ తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటనను షేర్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ “ నరేంద్రమోడీ అంతా బాగానే ఉందని చెబుతారు. కానీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం దేశంలో అత్యంత స్థాయిలో ఉన్నాయి.”

అని రాహుల్ ఎక్స్ ఖాతాలో హిందీలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ కూడా ప్రధాని మోడీపై తన విమర్శల దాడిని పెంచారు. “ ప్రధాని మోడీ అనేక సమస్యలపై విషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఒక చిన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి. 1951 నుంచి ప్రతి పదేళ్ల కోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తుంటారు. దీనివల్ల షెడ్యూల్ కులాలు, తెగల జనాభా ఎంత ఉందో వాస్తవంగా తేలుతుంది. 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జరగలేదు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? ” అని రమేశ్ ప్రశ్నించారు. ఇది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికే ఈ కుట్ర అని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News