Wednesday, January 22, 2025

రాహుల్ శివతాండవం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్య వాద తీర్మానం సందర్భంగా అధికారపక్షంపై పదునైన విమర్శ లదాడి చేశారు. వివిధ అంశాలను స్పృశిస్తూ ఒంటికాలిపై లేచారు. హిందూయిజం, అయోధ్య, మోడీ వ్యవహారశైలి, జిఎ స్‌టి, నీట్ తదితర అంశాలపై వాడివేడి వాదన వినిపించారు. గత ఎన్నికల్లో దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించిందన్నారు. విపక్షంలో ఉండడమే గర్వంగా సంతోషంగా ఉందన్నారు. సత్యమేవ జయతే అంటారు.. సత్యాలు చెబితే భరించలేరని బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనపై బిజెపి లెకలేనన్ని కేసులు పెట్టిందని, చివరకు ఇల్లు కూడా లాగేసు కుందని దుయ్యబట్టారు. రాహుల్ విమర్శలను ప్రధాని మోడీ, అమిత్ షా సహా పలువురు మంత్రులు తిప్పికొట్టారు.

శివుడి ఎడమ చేతి వెనక త్రిశూలం ఉం టుంది.త్రిశూలం హింసకు చిహ్నం కాదు కనుకే శివుడికి వెనక పైపు ఉంటుంది. హింసకు చిహ్నమైతే శివుడి కుడిచేతి లోనే ఉం డేది. చాలా మంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారు. ఆ చిహ్నమే అభయ ముద్ర. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు. భయం లేకుండా జీవించేందుకు అభయ ముద్ర అవసరం. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, మోడీఅ మాత్రమే హిందూ సమాజం కాదు. అన్ని మతా లు ధైర్యం, అహింసా, నిర్భయత సందేశాలను ఇస్తున్నాయి

శ్రీరాముడి జన్మ స్థలం అయోధ్య బిజెపికి గట్టి సందేశాన్నిచ్చింది. జనం భూములు బలవంతంగా లాక్కొని ఆలయాన్ని నిర్మించారు. అందుకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పారు. దానికి సాక్షం నా పక్కనే ఉంది(ఫైజాబాద్ ఎంపిని చూపిస్తూ..) ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా సంపన్నులు, కార్పొరేట్లను ఆహ్వానించిన మీరు అయోధ్య ప్రజలను మాత్రం పిలవలేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News