Monday, December 23, 2024

మిత్రులేమో ‘ధన’వీరులు..యువతేమో అగ్నివీరులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజెపిపై తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు. తన స్నేహితులకు 50ఏళ్ల లీజుపై విమానాశ్రయాలను అప్పగిస్తూ వారిని దౌలత్‌ వీరులను (ధనవంతులను) చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని యువజనులను మాత్రం నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో అగ్నివీరులను చేస్తున్నారంటూ రాహుల్ ట్విటర్ వేదికగా సోమవారం ధ్వజమెత్తారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యువజనులకు న్యాయం జరిగే వరకు ఈ సత్యాగ్రహం ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.

Rahul Gandhi Slams PM Modi over Agnipath

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News