Wednesday, January 22, 2025

అది ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల పథకం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఘజియాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలతో రద్దు చేసిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద బలవంతపు వసూళ్ల పథకంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని అవినీతి చక్రవర్తిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. బుధవారం నాడిక్కడ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనుకూలమైన వాతావరణం బలంగా అందని, 150 సీట్లకే బిజెపి పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.

పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు మార్పు ప్రభంజనం వీస్తుందని, లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రజలు ఘనంగా వీడ్కోలు పలుకుతారని అఖిలేష యాదవ్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూడాలని ఆయన అన్నారు. ఎన్నికల కోసం నిధుల సమీకరణలో పారదర్శకత కోసం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చామని ప్రధాని మోడీ అన్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు రద్దు చేస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బలవంతపు వసూళ్ల పథకంగా ఆయన ఎన్నికల బాండ్ల పథకాన్ని అభివర్ణించారు. ప్రధాని మోడీ ఎన్నిసార్లు, ఎంతగా వివరణ ఇచ్చుకున్నా వచ్చే ప్రభావమేమీ ఉండబోదని, ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి చక్రవర్తి అన్న విషయం యావద్దేశ ప్రజలకు తెలుసునని రాహుల్ ఆరోపించారు.

దేశంలో పేదరికాన్ని కాంగ్రెస్ అంతం చేస్తుందని తాను చెప్పిన మాటలపై ప్రధాని విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ ఒక్క చర్యతో దేశంలో పేదరికం అంతం అవుతుందని తాము ఎన్నడూ చెప్పలేదని, కాని అందుకు అవసరమైన దృఢమైన చర్యలను తీసుకుంటామని రాహుల్ తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడంపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ తెలిపారు. పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతో కలసి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేస్తుండగా మరి కొన్ని మిత్రపక్షాలతో కలుపుకుని మిగిలిన 63 స్థానాలలో సమాజ్‌వాది పార్టీ పోటీ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News