Saturday, November 23, 2024

ప్రజల గొంతు నొక్కేందుకు ఆయుధంగా పెగాసస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజల నోళ్లు మూయించడానికి ఒక ఆయుధంగా పెగాసెస్ స్పైవేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వాడుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం నాడిక్కడ భారతీయ యువజన కాంగ్రెస్ నిర్వహించిన సంసద్ ఘెరావ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడానికి ప్రధాని మోడీ అవలంబిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. మీ మొబైల్ ఫోనే మీ గొంతు..నాతోపాటే యువజనులందరి మొబైల్ ఫోన్‌లో పెగాసస్ అనే ఆలోచనను నరేంద్ర మోడీ చొప్పించారు. మీరు నిజాలు మాట్లాడితే మీ ఫోన్‌లో ఉన్న మోడీ, పెగాసస్ ఆ మాటలు వింటాయి. ప్రజల నోళ్లు మూయించడానికే పెగాసస్‌ను ఆయుధంగా వాడుకున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలు నిజాలు మాట్లాడటం మొదలుపెడితే మోడీ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావని రాహుల్ విమర్శించారు.

Rahul Gandhi slams PM Modi over Pegasus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News