న్యూఢిల్లీ: రైతులు, బిజెపి కార్యకర్తల హత్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఇంధనం ధరల పెరుగుదలలాంటి సమస్యలపై ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. తనను, తన స్నేహితుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ప్రధాని హింసాత్మకంగా స్పందిస్తారని రాహుల్ ఓ ట్విట్‌లో పేర్కొన్నారు. యుపిలోని లఖీంపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో రాహుల్ ఈ ట్విట్ చేశారు. ఆర్మీచీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ప్రశ్నలు సంధించారు. చైనా సైన్యం ఎల్‌ఎసిలోని చైనా సైడ్‌లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల్ని నిర్మిస్తున్నదని నరవణె ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో తెలిపారు. చైనా సైన్యం అక్కడ కొనసాగాలని చూస్తోందని నరవణె అన్నారు. వాళ్లు అక్కడ కొనసాగితే, మనం కూడా అక్కడే కొనసాగుతామని నరవణె అన్నారు. చైనా కొనసాగుతోంది ఎక్కడ..? మన భూభాగంలోనా..? అని రాహుల్ ప్రశ్నించారు.
రైతుల హత్యలు, ధరల పెరుగుదలపై ప్రధాని మౌనం దాల్చారు: రాహుల్‌గాంధీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -