Wednesday, January 22, 2025

ఇది పదవిని కాపాడుకునే బడ్జెట్: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బిజెపి మిత్ర పక్షాలను, ‘ఆశ్రితులను’ బుజ్జగించడం లక్షంగా దానిని రూపొందించారని రాహుల్ విమర్శించారు.

బడ్జెట్‌ను ‘కుర్సీ బచావో’ (పదవిని కాపాడుకునేది’గా కాంగ్రెస్ నేత అభివర్ణించారు. దానిని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో నుంచి కాపీచేశారని రాహుల్ ఆరోపించారు. ‘కుర్సీ బచావో బడ్జెట్. మిత్ర పక్షాలను బుజ్జగించండి: ఇతర రాష్ట్రాలను అలక్షం చేసి మిత్రులకు బోలు వాగ్దానాలు చేశారు. ఆశ్రితుల బుజ్జగింపు: ఎఎకు ప్రయోజనాలు, సామాన్య భారతీయునికి ఉపశమనం లేదు, కాపీ. అతికింపు: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక, పూర్వపు బడ్జెట్‌లు దించేశారు’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు.

ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా బడ్జెట్ కాపీ చేసినట్టిదని విమర్శించారు. ‘ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికను గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి చదివారని తెలిసి ఆనందించాను. కాంగ్రెస్ మేనిఫెస్టో 30వ పేజీలో పేర్కొన్న ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహకం (ఇఎల్‌ఐ)ని ఆమె అనుసరించినందుకు నాకు ఆనందంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 11వ పేజీ వివరించినట్లుగా ప్రతి అప్రెంటిస్‌కు ఒక భత్యంతో పాటు అప్రెంటిస్ పథకాన్ని ఆమె ప్రవేశపెట్టినందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. తప్పిన అవకాశాలను త్వరలోనే సంక్షిప్తంగా పేర్కొంటా’ అని కాంగ్రెస్ నేత పి చిదంబరం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News