Wednesday, January 22, 2025

కాంగ్రెస్ మేనిఫెస్టోపై అభిప్రాయాలు కోరిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ‘విప్లవాత్మకం’ అని చాలా మంది ప్రశంసించారని, ఈ నేపథ్యంలో ప్రజలు దీనిపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాహుల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. “ గతరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఈ వీడియో తయారు చేశాను.

అయితే తమ పార్టీ సహచరులు ఇది పోస్ట్ చేయడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని అంటున్నారు. కానీ ఈ సమాచారం ఇంకా సంబంధించింది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను” అని రాహుల్ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ సందేశంతోపాటు వీడియోను ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. తెలంగాణలో ర్యాలీ ముగించిన తరువాత ఈ వీడియో తయారు చేశానని రాహుల్ చెప్పుకొచ్చారు.

చాలామంది ఇది విప్లవాత్మకమైన మేనిఫెస్టోగా అభివర్ణిస్తున్నారని రాహుల్ తెలియజేశారు. కాంగ్రెస్ శుక్రవారం ఐదు లక్షాలతోకూడిన న్యాయపత్ర పేరుతో 25 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. పంటలకు చట్టపరంగా కనీస మద్దతుధర, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు 50 శాతం రిజర్వేషన్ పెంపు, దేశ వ్యాప్తంగా కులగణన, అగ్నిపథ్ స్కీమ్ రద్దు, తదితర హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News