Monday, December 23, 2024

కులగణనపై నేడు రాహుల్ మంతనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మేధావులతో జరిగే సమావేశం లో పాల్గొంటారు. దాదాపు 400 మంది వివిధ వర్గా ల వారితో ఆయన ముఖాముఖీలో పాల్గొననున్నా రు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత నేడు (మంగళవారం) రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4.45 గంటలకు వారు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సమావేశంలో వారు పాల్గొంటా రు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలను వారు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆ హ్వానం అందించామని కాంగ్రెస్ వర్గాలు తెలిపా యి. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.

ఈ నేపథ్యంలో వివిధ వర్గాలతో రాహుల్ భేటీ అవుతున్నారు. అందులో భాగంగా ట్రాన్స్‌జెండర్లతోనూ, మహిళలతోనూ రాహుల్ ముచ్చటిస్తారు. కులగణన ఎలా చేయాలన్న అంశాలపై రాహుల్ వారితో చర్చిస్తారు. అనంతరం రాత్రి 7.10 లకు బేగంపేటకు చేరుకొని ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్ గాంధీ పర్యటనపై చర్చించారు. కులగణన సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారు..? ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి..? ఏ కులాలకు ప్రభుత్వ సాయం ఎక్కువగా అవసరం..? అనే విషయాలను తెలుసుకొని డేటా రూపొందించి దాని ఆధారంగా ప్రభుత్వ ఫలాలను అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News