Wednesday, January 22, 2025

పెళ్లికి నేను వ్యతిరేకం కాదు: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే వచ్చినసమస్యల్లా ఉన్నతమైన తన తల్లిదండ్రుల వివాహ బంధంలా తాను కొలమానం నిర్దేశించుకోవడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి మనసులో మాట బయటపెట్టారు. కర్లీ టేల్స్ అనే ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌తో ఇష్టాగోష్ఠిగా రాహుల్ మాట్లాడారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో సాగినపుడు తన కంటెయినర్ వెలుపల ఆయన ఇచ్చిన ఇంటర్వూ వీడియోను కాంగ్రెస్ అదివారం తన అధికారిక సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. ఈ ఇంటర్వూలో రాహుల్ తన వివాహానికి సంబంధించిన ప్రశ్నలతోపాటు ఆహారపు అలవాట్లు, ఇతర కుటుంబ అంశాల గురించి సైతం మనుసు విప్పి మాట్లాడారు.

ముందుగా వివాహం గురించి మాట్లాడుతూ తాను పెళ్లికి వ్యతిరేకం కాదని 52 ఏళ్ల రాహుల్ సష్టం చేశారు. అసలు సమస్యంతా తన పేరెంట్స్ వల్లేనని, వారిది అద్భుతమైన వైవాహిక బంధమని, వారు ఒకరినొకరు సంపూర్ణంగా ప్రేమించుకున్నారని, అదే నాకు కూడా గీటురాయిగా మారిందని తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ చెప్పారు. అలాంటి అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటానని, అయితే ఆ అమ్మాయి ఆ గీటురాయికి తగ్గట్టు ఉండాలని ఆన్నారు. మీరు వివాహం చేసుకోదలచిన వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏమిటో నిర్ణయించుకున్నారా అన్న ప్రశ్నకు మంచి తెలివితేటలు ఉండి ప్రేమించే వ్యక్తి అయితే చాలు అంటూ రాహుల్ బదులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News