Tuesday, November 5, 2024

ఆ రోజు ఉగ్రవాదులు నన్ను చంపేసే వారే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్‌లో ఎదురయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘ఆ ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగే ముప్పు ఉందని, అక్కడ యాత్ర చేయవద్దని భద్రతా సిబ్బంది నాకు చెప్పారు. కానీ నేను నా పార్టీ వాళ్లతో మాట్లాడి ముందుకు వెళ్లాలనే నిశ్చయించుకున్నా.అలా నడుస్తున్నప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పాడు.

కాంగ్రెస్ నేతలు నిజంగానే కశ్మీర్‌కు వచ్చి అక్కడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఆ తర్వాత కొంత సేపటికి ఆ వ్యక్తి దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పాడు. ఆ సమయంలో నేను నిజంగానే సమస్యలో ఉన్నానేమోననిపించింది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ముష్కరులు నన్ను చంపేసే వారే కానీ అలా చేయలేదు. లిజనింగ్‌కు ఉన్న శక్తి అది’ అని రాహుల్ నాటి సంఘటనను వివరించారు. ప్రజా సమస్యలను వినడానికి వచ్చానన్న కారణంతోనే వాళ్లు తనపై దాడి చేయలేదన్న అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News