Sunday, December 22, 2024

తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్ ఏర్పాటు చేస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణతో మా కుటుంబానికి రాజకీయ సంబంధం కాదు.. అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లా కాటారంలో కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2014లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర్రాన్ని ఇచ్చిందని తెలిపారు. సోనియా గాంధీ.. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించామని.. కానీ, తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని మండిపడ్డారు.

కెసిఆర్..దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అని… కెసిఆర్ అవినీతిపై ఈడీ, సిబిఐ విచారణ ఎందుకు జరగట్లేదో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. తెలంగాణ ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూస్తున్నామని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ సంపదను పంచుతామని రాహుల్ తెలిపారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇవ్వడంతోపాటు గ్యాస్ సిలిండర్ ను రూ.500కే అందిస్తామన్నారు.అలాగే, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్ ను ఏర్పాటు చేస్తామని.. సిఎం, ఆయకు కుటుంబం కలిసి సంపదను ఎలా దోచుకుందో మీ ముందు ఉంచామని” అని రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read: అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన చేపడతాం: రాహుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News