Friday, December 20, 2024

అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం

- Advertisement -
- Advertisement -

నాగపూర్: దేశంలో అనేక రంగాలలో ఓబిసిలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారిలోకి వస్తే కుల గణన చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హమ్ తయార్ హై పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన హుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. నాగపూర్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ నాగపూర్‌లో రెండు సిద్ధాంతాలు ఉన్నయాని, ఒకటి బిఆర్ అంబేద్కర్‌కు చెందిన అభ్యుదయ సిద్ధాంతమైతే మరొకటి దేశాన్ని నాశనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని విమర్శించారు. అంబేద్కర్ తన అనుచరులతో కలసి బౌద్ధమతాన్ని స్కీరించిన దీక్షాభూమి నాగపూర్ కావడం విశేషం. సామాన్యుడి చేతికి అధికారం ఇవ్వడమే కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన అన్నారు.

దేశంలో కొట్లాది మంది ప్రజలనునిరుద్యోగంలోకి నెట్టిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన విమర్శించారు. తమకు రెండు భారత్‌లు వద్దని, యువతకు ఉపాధి కల్పించగల సత్తా కేవలం ఇండియా కూటమికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణనను ఇండియా కూటమి ప్రభుత్వం చేపడుతుందని రాహుల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ఎంతమంది యువజనులకు ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనంత అధికంగా దేశంలో నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోందని ఆయన అన్నారు. ఓబిసీలు, దళితులు, గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన వివిధ రంగాలలో తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన తెలిపారు. గతంలో తనను తాను ఒబిసిగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించుకునేవారని, కాని కుల గణన కోసం తానుడిమాండ్ చేసిన తర్వాత దేశంలో ఒక్కటే కులం ఉందని, అది పేదల కులమని మోడీ అంటున్నారని రాహుల్ తెలిపారు.

మరి దేశంలో ఒకే కులం ఉంటే ఒబిసినని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారని మోడీని రాహుల్ నిలదీశారు. బిజెపిలో పైనుంచి ఆదేశాలు వస్తాయని, కాని కాంగ్రెస్‌లో కార్యకర్త సైతం నాయకత్వాన్ని ప్రశ్నిస్తాడని ఆయన తెలిపారు. సామాన్యుడి చేతిలో పాలనా పగ్గాలు ఉండాలని ఆయన అన్నారు. గతంలో సామంత రాజ్యాలకు బ్రిటిష్ పాలకులతో భాగస్వామ్యం ఉండేదని, అప్పట్లో సామాన్య ప్రజలు బ్రిటిష్ పాలకులతో, సామంత రాజ్యాలతో పోరాడేవారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బిజెపి అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా హాజరుకాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News