Monday, December 23, 2024

మోడీకి ధైర్యముంటే… 2011 జనాభా లెక్కలు తేల్చాలి: రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుల ప్రాతిపదిక రాజకీయాలతో ప్రతిపక్షాలపై దాడికి దిగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. 2011లో జరిగిన కులప్రాతిపదిక జనగణన నివేదికను బయటపెట్టే ధైర్యం మోడీకి లేదని, ఇదే విధంగా సామాజికి ఆర్థిక, కులజనగణన నిర్వహించేందుకు ముందుకు రాదని చెప్పారు. కేంద్రంలోని ప్రభుత్వం ఓట్ల రాజకీయాలకు కులాల చిచ్చు రగులుస్తోందని, నిజానికి దేశంలో జరగాల్సింది అణగారిన వర్గాలకు ఆర్థిక అభ్యున్నతి, వారికి సరైన రీతిలో రాజకీయాధికారం అని రాహుల్ స్పష్టం చేశారు.

Also Read: ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపి: రాహుల్ ఆరోపణ

దళితులు, గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన కోటా కల్పించాల్సి ఉందని, ఈ క్రమంలో 50 శాతం కోటా పరిమితిని తొలిగించాలని డిమాండ్ చేశారు. కేవలం శుష్కవాగ్దానాలు, కల్లబొల్లి కబుర్లతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ముందు 2011 కుల జనగణన గణాంకాల నివేదికను వెల్లడించండి. దేశంలో ఎందరు ఒబిసిలు ఉన్నారనేది తెలియచేయండి. 50 శాతం కోటా పరిమితిని ఎత్తివేయండి. దళితులు గిరిజనులకు రిజర్వేషన్లు పెంచండని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News