Wednesday, January 22, 2025

కాళేశ్వరం ప్రాజక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటిఎంలా మారింది: రాహుల్

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజక్టు కేసీఆర్, ఆయన కుటుంబానికి ఎంటిఎంలా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరోపించారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబట్ పల్లిలో గురువారం ఉదయం నిర్వహించిన మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య రానున్న ఎన్నికల్లో పోటీ జరగనుందని చెప్పారు. తెలంగాణ సంపద దోపిడీకి గురువుతందని… కాళేశ్వరం ప్రాజక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటిఎంలా మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.

కేసీఆర్ దోచుకున్న డబ్బును రాష్ట్రంలోని ప్రతి మహిళ ఖాతాలో వేస్తామని… మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. దొరలను గద్దె దించాలంటే.. ఈ ఎన్నికల్లో మహిళలందరూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News