Thursday, January 23, 2025

మోడీ, కేసీఆర్.. ఇద్దరు కలిసే పనిచేస్తున్నరు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కుచెదరలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో జరిగిన బహింరగ సభలో రాహుల్ గాంధీ పాల్డొని ప్రసంగించారు.పైసలొచ్చే శాఖలను కేసీఆర్.. తన కుటుంబసభ్యులకే ఇచ్చారని అన్నారు.

ఈ పదేళ్లలో అవినీతి సర్కార్ ను చూశారు.. తన కళ్లారా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని చూశానని చెప్పారు. తన మీద మోడీ 24 కేసులు పెట్టించారని.. అవినీతికి పాల్పడిన కేసీఆర్ మీద మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. పరీక్షలు పెట్టి.. పేపర్లు లీక్ చేస్తారని.. నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారని విమర్శించారు. దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణ మధ్యే యుద్ధం జరుగుతుందని.. ప్రజల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని రాహుల్ గాంధీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News