Monday, December 23, 2024

మీరు భారత మాతను హత్య చేశారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో మణిపూర్ అల్లర్లు దేశంలో భాగం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోడీ మణిపూర్‌ను రెండు వర్గాలు విడగొట్టి.. భారత మాతను హత్య చేశారని దుయ్యబట్టారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని చంపేశారని రాహుల్ మండిపడ్డారు. బిజెపోళ్లు దేశ భక్తులు కాదని దేశద్రోహులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపోళ్లు దేశాన్ని రక్షించే వారు కాదని… దేశ హంతకులు అని ధ్వజమెత్తారు. మణిపూర్ లో బిజెపోళ్లు తల్లులను హత్య చేశారని, భారత సైన్యం తలుచుకుంటే మణిపూర్‌లో ఒక్క రోజులోనే శాంతి సాధ్యమన్నారు. మోడీ మణిపూర్ మాట వినేందుకు ఇష్టపడడంలేదని, రావణులు కూడా కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే వినేవాడని, మోడీ కూడా అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని రాహుల్ విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News