Sunday, January 19, 2025

క్షమాపణ చెప్పేందుకు రాహుల్‌కు ఇంకా సమయముంది: ఠాకూర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పేందుకు ఇప్పటికీ సమయం ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు గురువారం కొట్టివేసిన తర్వాత మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

‘కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిటిషన్‌నుసెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ రాజవంశం ఉద్దేశపూర్వకంగా ఒబిసిలను అవమానించిందని మరోసారి రుజువయింది’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. జాతికి క్షమాపణ చెప్పడానికి రాహుల్ గాంధీకి ఇప్పటికీ సమయం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News