Friday, January 24, 2025

రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు రూ.10 లక్షల ధర!

- Advertisement -
- Advertisement -

సుల్తాన్‌పూర్(యుపి): లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలి ఎంపి రాహుల్ గాంధీ తన దుకాణంలో కుట్టిన చెప్పులు కొనుక్కుంటామంటూ రూ. 10 లక్షలు ఇవ్వడానికి కూడా కూడా కొందరు ముందుకు వచ్చారని సుల్తాన్‌పూర్‌కు చెందిన చర్మకారుడు రామ్ చేత్ వెల్లడించారు. అయితే ఆ చెప్పులను తాను విక్రయించే ప్రసక్తి లేదని, తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఆ చెప్పులను గ్లాస్ ఫ్రేమ్‌లో పెట్టి తన దుకాణంలో భద్రపరుస్తానని ఆయన చెప్పారు. జులై 26న పరువునష్టం కేసు విచారణ సందర్భంగా సుల్తాన్‌పూర్ కోర్టులో హాజరైన రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో సుల్తాన్‌పూర్ శివార్లలోని రోడ్డు పక్కన ఉన్న చెప్పుల దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. దుకాణం యజమాని చర్మకారుడు రామ్ చేత్‌ను పలకరించిన రాహుల్ ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ఒక చెప్పులను కుట్టడంతోపాటు షూస్‌ను గమ్‌తో అతికించారు.

రాహుల్ గాంధీ వచ్చి వెళ్లిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు తన వద్దకు వచ్చి నీ సమస్యలేమిటో చెప్పాలని అడుగుతున్నారని రామ్ చేత్ తెలిపారు. తాను ఒక్కసారిగా సెలబ్రిటీని అయిపోయానని ఆయన చెప్పారు. ప్రపంచం హఠాత్తుగా మారిపోయింది. అంతకుముందు వరకు నేనెవరో ఎవరికీ తెలియదు. కాని ఇప్పుడు ప్రజలు నా దుకాణానికి వస్తున్నారు..నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు అని రామ్ చేత్ తెలిపారు. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు కావాలంటూ చాలా మంది తనకు ఫోన్ చేస్తున్నారని ఆయన చెప్పారు.

గత మంగళవారం ప్రతాప్‌గఢ్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆ చెప్పులను రూ. 5 లక్షలకు కొంటానని చెప్పాడని, తాను అమ్మనని చెప్పగా రూ. 10 లక్షలు ఇస్తానని బేరం చేశాడని ఆయన తెలిపారు. తనకు అదృష్టం తెచ్చిపెట్టిన ఆ చెప్పులు అమ్మే ప్రసక్తి లేదని వారికి తేల్చిచెప్పానని ఆయన తెలిపారు. తన దుకాణానికి వచ్చి, తన కోసం చెప్పులు కుట్టిన రాహుల్ ఇప్పుడు తన దుకాణంంలో భాగస్వామిగా మారారని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News