Thursday, January 23, 2025

జోడో యాత్ర ఆపేయాలంటూ రాహుల్‌కు కేంద్రం వినతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన భారత్ జోడో యాత్రను నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ బుధవారం మంగళవారం రాహుల్ గాంధీకి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఈ మేరకు ఒక లేఖ రాశారు. రాజసథాన్‌కు చెందిన ముగ్గురు బిజెపి ఎంపీలు కొవిడ్ తిరిగి విజృంభించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాహుల్ యాతరపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

రాహుల్ యాత్రలో పాల్గొనేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, వ్యాక్సినేషన్ తీసుకున్న వారినే యాత్రలో అనుమతించడం తదితర కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఆ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. రాహుల్ యాత్ర బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News