Sunday, January 26, 2025

శంకర్‌దేవ్ జన్మస్థలానికి నేను తప్ప మిగతావారు వెళ్లవచ్చా : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

నగావ్ ( అస్సాం ) : శాంతి భద్రతల సంక్షోభ సమయంలో అస్సాం లోని నగావ్ జిల్లా లో ఉన్న వైష్ణవ రుషి శంకర్‌దేవ్ సత్ర జన్మస్థలాన్ని సందర్శించడానికి తనకు అనుమతి లేదు కానీ , ఇతరులు మాత్రం వెళ్లొచ్చా ? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం నిలదీశారు. శంకర్‌దేవ్ సత్రకు వెళ్లే రూటులో హైబోరాగావ్ వద్ద రాహుల్‌తోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను, మద్దతుదార్లను అధికారులు అడ్డుకున్నారు. అక్కడ నుంచి వారిని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో రాహుల్ ఇతర నాయకులు అక్కడ ధర్నా చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బతద్రవ ఎమ్‌ఎల్‌ఎ సిబమోని బోరా ఈ సమస్య పరిష్కారానికి శంకర్‌దేవ్ జన్మస్థలానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చాక రాహుల్ విలేఖరులతో మాట్లాడుతూ శంకర్‌దేవ్ వలెనే తాముకూడా ప్రజల మధ్య సమష్టి భావాన్ని కోరుతున్నాం తప్ప ద్వేషాన్ని వ్యాపింప చేయడానికి కాదని వ్యాఖ్యానించారు.

శంకర్‌దేవ్ తమకు గురువు వంటి వారని, తమకు మార్గదర్శకులని, అందుకనే తాను ఎప్పుడు అస్సాం వచ్చినా, ఆయన జన్మస్థలాన్ని సందర్శించడం ద్వారా ఆయనను గౌరవించడం పరిపాటి అయిందన్నారు. అక్కడకు వెళ్లకుండా తనను ఎందుకు అడ్డుకున్నారని రాహుల్ పోలీస్‌లను ప్రశ్నించారు. ఎవరు ఆలయాన్ని ఎప్పుడు సందర్శించాలో ప్రధాని మోడీ నిర్ణయిస్తారా ? అని వ్యాఖ్యానించారు. తాము ఎలాంటి సమస్యలను సృష్టించబోమని, సత్రాలో ప్రార్థనలు మాత్రమే చేస్తామని రాహుల్ పేర్కొన్నారు. సత్రా పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాహుల్ ఒక్కరే వస్తే శాంతిభద్రతల సమస్యగా అధికారులు చెబుతుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. రాహుల్‌ను అక్కడకు వెళ్ల నివ్వకుండా అధికారులపై ప్రధాని మోడీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

శంకర్‌దేవ్ సత్రాను సందర్శించడానికి జనవరి 11న తమకు అనుమతించారని, మేనేజింగ్ కమిటీ కూడా ఆహ్వానించిందని, కానీ జనవరి 20న అకస్మాత్తుగా అయోధ్య రామ ప్రతిష్ట తరువాతనే శంకర్‌దేవ్ సత్ర వద్దకు వెళ్లాలని అడ్డుకున్నారని జైరామ రమేశ్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News