Thursday, January 23, 2025

నేనోటి చెపితే మరోటి చెప్పారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

కొజికోడ్ : కాంగ్రెస్ నాయకుడు, ఎంపి రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రసంగ అనువాదకర్తలు చుక్కలు చూపించారు. ఈ విషయాన్ని కేరళలో ఈ కేరళ ఎంపి బుధవారం స్వయంగా విన్నవించుకున్నారు. అయితే ఇక్కడ మలయాళిలో ఆయన తనబాధ పంచుకోవల్సి వచ్చింది. తెలంగాణలో తాను ఇటీవల భారీ స్థాయిలో ఎన్నికల సభల్లో పాల్గొని ప్రచారం చేసిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. తాను హిందీలో మాట్లాడేవాడిని, అక్కడ తన ప్రసంగం తర్జుమా పద్ధతి తనకు ఓ వైపు నవ్వు మరో వైపు కోపం తెప్పించిందని రాహుల్ తెలిపారు. ఓ చోట తాను ఒక్కటి మాట్లాడితే దీనిని మరో విధంగా తెలియచేశారని చెప్పారు. ఇదే తనకు ప్రజల స్పందన ద్వారా తెలిసో వచ్చిందని, మరో చోట ఎందుకైనా మంచిదని తాను తన మాటల్లోని పదాలను లెక్కించుకునేవాడనిని గుర్తు చేశారు.

ఓ చోట తాను హిందీలో ఐదారు పదాల మాట్లాడితే అనువాదక సోదరుడు ఏకంగా 20 నుంచి 30 వరకూ పదాలతో మాట్లాడుతూ వచ్చారని తెలియచేసుకున్నారు. ఎన్నికల సభలలో ప్రసంగించడం ఓ వేదనే అవుతుందని, ఇక తర్జుమాలపై ఆధారపడితే అది ప్రసంగవేదనే అయిందని రాహుల్ చమత్కరించారు. కేరళలోని కోజికోడ్‌లో బుధవారం జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ సభలో రాహుల్ మాట్లాడారు. ఇక్కడ రాహుల్ ప్రసంగాన్ని ప్రముఖ వక్త ఐయుఎంఎల్ ఎంపి అబ్దుస్సమాద్ సమాధని తర్జుమా చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తనకు అనువాదకులుగా మారడం ఇతరులకు ఇబ్బంది అవుతుందేమో లేక ఇతరులు తనకు అనువాదకులు అయితే తనకు కష్టాలు తప్పవేమో అని చమత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News