Monday, December 23, 2024

కార్పొరేటర్లకు దోచిపెడుతున్న మోడీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్ /టౌన్: కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2024లో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణలో దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం నడుస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ జన్‌ధన్‌తో పేదల బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి వేయలేదని దుయ్యబట్టారు. మోడీ నా ఇల్లు ఖాళీ చేయించారు కానీ దేశం మొత్తం నా ఆయన అన్నారు. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని అ న్నారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు కలలు కన్నారని తరువాయి
అన్నారు. నాగార్జునసాగర్, జూరాల, సింగూరు, శ్రీశైలం ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టామని అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ పాలనలో దళితులకు బడుగు బలహీన వర్గాలకు భూములు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.

దేశ సం పదను ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజెపిపై నిప్పులు చెరిగారు. జన్ ధన్ ద్వారా ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేస్తానన్న మోడీ బడ్జెట్ నుంచి డబ్బులు తీసి అదానీ అప్పు కట్టారని ఆ యటన దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రవేశపెడుతామని అన్నారు. ప్రతి నెల 2500 మహిళల ఖాతాలో వేస్తామని రాహుల్ తెలిపారు. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఏ మహిళ కూడా బ స్సులో ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అన్నారు.దేశంలో, రాష్ట్రంలో బిజెపి, ఎంఐఎం, బిఆర్‌ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడి ప్రతిపక్ష నాయకులపై ఈడి, సిఐడి కేసులు పెడుతున్నారని తెలంగాణలో మాత్రం ఈడి, సిఐడి ఎవరు ఇక్కడ కనిపించడం లేదని ఆయన ఎద్దేవ చేశారు.

మోడీ నా ఇల్లు ఖాళీ చేయించారు..కానీ దేశం మొత్తం నా ఇల్లు
ప్రధాని నరేంద్ర మోడీ అక్రమంగా నన్ను ఇల్లు ఖాళీ చేయిస్తే కోట్లాది మంది నన్ను హక్కున చేర్చుకున్నారని రాహుల్ అన్నారు. బిజెపిపై నా పోరాటం ఆగదని అన్నారు. ఈడి, ఇన్‌కం ట్యాక్స్ శాఖలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. బిజెపి బిసి ముఖ్యమంత్రి అని కొత్త డ్రామాకు తెరతీసిందని ఆయన అన్నారు. ఇన్ని రోజులు బిసిల గురించి బిజెపికి యాది రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం బిజెపికి తొత్తుగా మారిందని, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ఏ రాష్ట్రంలో బిజెపి పోటీ చేస్తే ఎంఐఎం పోటీ చేసి బిజెపికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తుందన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి చల్లా వంశీధర్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకత్వం సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు రవి, భట్టి విక్రమార్క, కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News