Friday, April 25, 2025

ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతు

- Advertisement -
- Advertisement -

ప్రధాన ప్రతిపక్ష ఎంపి రాహుల్ గాంధీ
భద్రతా, నిఘా వైఫల్యాలు నిజమే
పహల్గామ్ దాడిపై అమిత్ షా అంగీకారం
కీలకమైన అఖిలపక్ష షమావేశం ఏర్పాటు
భేటీకి ప్రధాని రాకపోవడంపై విపక్షం నిరసన
ఘటన వివరాలపై ఐబి చీఫ్ వీడియో వివరణ
నేడు అనంత్ నాగ్‌లో రాహుల్ గాంధీ పర్యటన

న్యూఢిల్లీ : పహల్గామ్ ఉగ్రదాడులు జరగడానికి భద్రతా వైఫల్యాలే ప్రధాన కారణం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంగీకరించారు. దాడుల విషయంలో భద్రతా బలగాలు నిర్లిప్తత , ఇంటలిజెన్స వర్గాల పర్యవేక్షణా లోపాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలోనే గురువారం ఇకకడ అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి టెర్రర్ క్యాంప్‌లను ఏరివేయాలని సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలు అంతా పిలుపు నిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తప్పనిసరి, ఉదాసీనత పనికిరాదని వివరించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకునేందుకు, తదుపరి చర్యల ఖరారుకు అఖిల పక్ష సమావేశాన్నిరహస్యంగా నిర్వహించారు. లోపాలు జరిగినందునే ఇప్పుడు మనం అంతా కలిసి కూర్చుని పరిస్థితిని సమీక్షించుకుంటున్నామని , అంతా సవ్యంగా ఉంటే ఇక ఇటువంటి భేటీల అవసరం ఏముంటుందని విపక్షాలపై ఆయన సున్నితంగా విమర్శలకు దిగారు.

ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎప్పుడో ఒక్కసారి , ఏదో ఓ చోట అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి. పహల్గామ్ తరహా దాడికి తావుండదని భావిస్తూ వచ్చి ఉంటామని, అదును చూసుకుని ఉగ్రవాదులు రెచ్చిపొయ్యారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వివరణ తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తామంతా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిని సమావేశానికి వచ్చిన వివిధ పార్టీల నేతలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాద చర్యలకు గట్టి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో తామంతా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్షాలన్ని కూడా పహల్గామ్ దాడులను ఖండిస్తున్నాయి. దాడులకు కారకులు అయిన వారిని గుర్తించడం,తెరెనుకున్న శక్తులను కనగొని చర్యలు తీసుకోవడం అత్యవసరం అన్నారు.

చిరకాలంగా చితికిపోతున్న కశ్మీర్ పట్ల దేశం యావత్తూ ఆవేదన చెందుతోంది. ప్రత్యేకించి ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ చర్యలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం అనంత్‌నాగ్‌లో పర్యటిస్తారని పార్టీ అధ్యక్షులు ఖర్గే ఆ తరువాత మీడియాకు తెలిపారు. ఉగ్రవాదంపై తీవ్రస్థాయి పోరు తప్పదు. ఈ దిశలో దేశం అంతా కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని టిఎంసి ఎంపి సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఈ సమావేశంలోనే ఇంటలిజెన్స్ బ్యూరో సీనియర్ అధికారులు, ప్రభుత్వ తరఫు ప్రతినిధులు ఎంపిలకు వివరించారు. భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ తెలిపారు.

గురువారం జరిగిన అఖిలపక్ష భేటీకి ఖర్గే , టిఎంసి ఎంపీలు, నేతలు తరలివచ్చారు. ఉగ్రవాదం అణచివేతకు అన్ని చర్యలు తీసుకుంటుందని , ప్రతిపక్షాలకు ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే ఎటువంటి చర్యలకు దిగుతామనేది, ఎప్పుడు? ఎక్కడా అనేది వివరించలేదు. ప్రతిపక్షం కూడా ఈ విషయంలో వివరాలకు పట్టుబట్టలేదని వెల్లడైంది. ఇప్పటి సమావేశంలో అంతా కలిసి సానుకూల నిర్ణయానికి వచ్చామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ విలేకరులకు తెలిపారు.

ప్రధాని రాలేదెందుకు ః ప్రశ్నించిన ఆప్ ఎంపి సంజయ్ సింగ్

కీలక అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ ఎందుకు రాలేదని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆయన వాదనను కాంగ్రెస్ నేత ఖర్గే సమర్థించారు. ఎందుకు రాలేదనే విషయంపై అధికారిక వివరణ అవసరం అన్నారు. ఇకపై ప్రధాని నాయకత్వంలో అఖిలపక్షం జరగాల్సి ఉందని సంజయ్ సింగ్ తెలిపారు. సమావేశానికి ముందు ఎంపిలు , నేతలు అంతా లేచి నిలబడి పహల్గామ్ మృతుల సంతాపసూచకరంగా ఓ నిమిషం నివాళి అర్పించారు.

సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా వచ్చారు. సమావేశానికి ముందు రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడులు, ఇప్పటి సమావేశం అవసరం గురించి వివరించారు. తరువాత ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దెకా 20 నిమిషాల నిడివి ఉండే వీడియో ద్వారా ఉగ్రవాద దాడి వివరాలను ప్రతిపక్ష నేతలకు చూపించారు. తరువాత పలువురు నేతల ప్రశ్నలకు ఆయన హోం మంత్రి అమిత్ షా నుంచి వివరణల నడుమ సమాధానాలు ఇచ్చారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News