Monday, December 23, 2024

తల్లికి కుక్కపిల్ల కానుక ఇచ్చిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తన తల్లి సోనియా గాంధీకి అపురూప కానుకగా నూరీని అందించాడు. సోనియా నివాసానికి వచ్చిన రాహుల్ ముందుగా తల్లికి సమాచారం ఇచ్చాడు. ఓసారి బయటకు వస్తే విస్తుపోయే సంగతి ఒకటుందని తెలిపాడు. దీనితో ఆదరాబాదరగా వచ్చిన తల్లికి ఓ బాక్స్ అందించాడు. అందులో చిన్న కుక్కపిల్ల జాక్ రస్సెల్ టెరియర్ పప్పీ ఉంది.దానికి రాహుల్ నూరీ అనే ముద్దుపేరు పెట్టి, ప్రపంచ జంతు దినోత్సవం నేపథ్యంలో బహుమతిగా ఇచ్చాడు.

దీనిని చూసి సోనియా మురిసిపోతూ ముద్దుగా ఉందని మెచ్చుకున్నారు. తరువాత రాహుల్ తల్లికి కుక్కపిల్లను బహుకరించిన ఫోటోను తన ట్విట్టర్‌లో పొందుపర్చాడు. తమ కుటుంబంలోకి సరికొత్త, అందమైన మరో సభ్యులు వచ్చిచేరారని స్పందించారు. రాహుల్ స్పందించే వ్యక్తి అని, జంతుప్రేమికుడు అని, కేవలం నేతనే కాదు అంతకు మించిన మానవతావాది అని నెటిజన్లు కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News