Sunday, January 19, 2025

సిఎం స్టాలిన్ కోసం రాహుల్ స్వీట్ గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి ఓ ‘స్వీట్ గిఫ్ట్’ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కోసం స్వయంగా దుకాణానికి వెళ్లి , ఓ స్వీట్ గిఫ్ట్ తీసుకున్నారు. ఆ కానుకను అందుకున్న సీఎం, రాహుల్ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కోయం బత్తూరులో స్టాలిన్‌తో కలిసి రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సభ తరువాత నిన్న రాత్రి సింగనల్లూరు లోని ఓ మిఠాయి దుకాణానికి రాహుల్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

అందులో కాంగ్రెస్ నేత రోడ్డు మధ్య లోని డివైడర్‌ను దాటి దుకాణానికి వెళ్లారు. రాహుల్‌ను చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏం కావాలి సర్? అని అడగ్గా…. మా బ్రదర్ స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనాలి అని చెప్పడం వీడియోలో ఉంది. ఈ సందర్భంగా షాప్ లోని మిఠాయిలను రాహుల్ రుచి చూశారు. అనంతరం ఆ స్వీట్లను తీసుకుని స్టాలిన్ ఇంటికి వెళ్లి సీఎంకు అందించారు. ఈ వీడియోకు స్టాలిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. “ నా సోదరుడు రాహుల్ గాంధీ స్వీట్ కానుకతో నా హృదయం నిందిపోయింది. జూన్ 4న (ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ) ఇండియా కూటమి కూడా తప్పకుండా ఇలాంటి తీపి విజయాన్నే అందుకుంటుంది ” అని ధీమా వ్యక్త చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News